బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-2లో ప్రభాస్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌-2లో ప్రభాస్

బాలయ్య అన్ స్టాపబుల్ - 2 షోకి ప్రభాస్ వస్తుండనే వార్తలకు ఓటీటీ సంస్థ ఆహా క్లారిటీ ఇచ్చింది.  ప్రభాస్, బాలకృష్ణ సేమ్ స్టైల్లో  చేసిన ఓ వీడియోను ఆహా టీం తమ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. బాహుబలి ఎపిసోడ్ త్వరలో మీ ముందుకు రానుందని.., ఫస్ట్ టైం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్ స్టాపబుల్ 2 లో పాల్గొంటున్నారని తెలిపింది. ఈ వీడియోను చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ వీడియో రిలీజ్ చేసిన 4  గంటల్లోనే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్ ఈ షోకి వస్తుండని తెలియడంతో అన్ స్టాపబుల్2 షో లేటెస్ట్ ఎపిసోడ్ పై భారీగా అంచనాలు పెరిగాయి.  ఈ షోలో ఇప్పటికే పలువురు ప్రముఖ డైరెక్టర్లు,నటీ నటులు, రాజకీయనాయకులు ఈ షోకి వచ్చి అలరించారు. బాలకృష్ణ వేసే క్వశ్చన్ లు , వారి మధ్య ముచ్చట్లతో ఈ షో బాగా పాపులర్ అయ్యింది.