బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘దాదా’. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా మూవీ టీమ్ నెక్స్ట్ షెడ్యూల్‌కు సిద్ధమైంది. సెప్టెంబర్ 29 నుంచి మైసూర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొననున్నారు.
రెండు నెలల క్రితం ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా బాలకృష్ణ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల కానుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
