గోవాలో బాల మురుగన్ను అరెస్ట్ చేసిన పోలీసులు

గోవాలో బాల మురుగన్ను అరెస్ట్ చేసిన పోలీసులు

డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్‌ సరఫరా చేసిన మరో నిందితుడు బాలమురుగన్‌ ను నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్విన్‌ ఇచ్చిన సమాచారంతో
గోవాలో బాలమురుగన్‌ ను అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, గోవాలో జోరుగా డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నాడనే సమాచారంతో మెరుపు దాడి చేశారు. అక్రమ సంపాదనతో బాలమురుగన్‌ హోటళ్లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. 

హోటళ్ల కేంద్రంగా బాలమురుగన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి జాబితాలో దేశవ్యాప్తంగా 2వేల మంది వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. బాల మురుగన్ ను గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు పోలీసులు.