
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి దీక్షా సన్యాస స్వీకరణ కార్యక్రమం కృష్ణా నదీ తీరాన ఘనంగా జరిగింది. శారదా పీఠం ఉత్తరాధికారిగా బాలస్వామి కిరణ్ కుమార్ శర్మ దీక్ష తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు కిరీట ధారణ చేశారు. ఈ దీక్షా స్వీకరణ తర్వాత.. ఆయనకు స్వాత్మానందేంద్ర సరస్వతిగా పేరు పెట్టారు. తర్వాత పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు స్వాత్మానందేంద్ర స్వామి. స్వరూపానంద పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు.