అన్‌స్టాపబుల్ షోలో నలుగురు లెజెండరీ దర్శక, నిర్మాతలు

అన్‌స్టాపబుల్ షోలో నలుగురు లెజెండరీ దర్శక, నిర్మాతలు

ఇటీవలే మొదలైన సీజన్ 2 ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోన్న “గాడ్ ఆఫ్ మాసెస్” నందమూరి నటసింహం హోస్ట్ గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ NBK షోకి ఈ సారి ప్రముఖులు గెస్టులుగా రాబోతున్నారు. తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా, నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, సురేశ్ బాబు, అల్లు అరవింద్ లు వచ్చే ఎపిసోడ్ లో తమ మనోభావాలను పంచుకోనున్నట్టు ఆహా తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దాంతో పాటు ఈ షోలో వారు పాల్గొన్న కొన్ని ఫొటోలను జత చేసింది. అయితే తెలుగు సినిమాను అప్పట్లోనే కొత్త రికార్డులను నమోదు చేయించిన వారితో పాటు, ఈ తరం సినిమాలను కొత్త దారుల్లో పరుగులు తీయిస్తున్న ప్రముఖులు ఈ షోకి రానుండడంతో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మొదటి సీజన్ సక్సెస్ కావడంతో గత 1.5నెలల క్రితమే అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ ప్రారంభమైంది. మొదటి సీజన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీజన్ లోనూ బాలయ్య అంతే ఉత్సాహంతో ప్రేక్షకులను అలరిస్తూ... నవ్విస్తున్నారు. మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్‌లు అలరించగా, రెండో ఎపిసోడ్ లో విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ విచ్చేశారు. ఇక మూడవ ఎపిసోడ్ లో మేకర్స్ “మేజర్” ఫేమ్ అడివి శేష్ తో పాటు శర్వానందను ఆహ్వానించగా.. నాల్గవ సీజన్‌లో ఇద్దరు ప్రముఖ తెలుగు రాజకీయ నాయకులు వచ్చారు. వారే- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. ఇక తాజాగా నాల్గో సీజన్ లో ఎవరు పాల్గొనబోతున్నారనే విషయాన్ని ఆహా వెల్లడించింది.