బల్దియా ఉద్యోగులకు జీతాలు రాలే

బల్దియా ఉద్యోగులకు  జీతాలు  రాలే
  • 12వ తేదీ దాటినా పర్మినెంట్, ఔట్​సోర్సింగ్ ఎంప్లాయీస్​కు అందని వేతనాలు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో పర్మినెంట్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందలేదు. 12వ తేదీ దాటినా వేతనాలు అందకపోవడంపై ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతినెలా ముందుగానే వేస్తున్నప్పటికీ ఈ నెల మాత్రం చాలా ఆలస్యం చేస్తున్నారని.. ఈఎంఐలు, లోన్లు ఉన్న వారికి చెక్ బౌన్స్​లు అవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. కొన్ని జోన్లలో ఉద్యోగులు ఒత్తిడి తేవడంతో అక్కడ వారికి జీతాలు వేసినట్లు తెలుస్తోంది. 

గ్రేటర్ హైదరాబాద్​లో మొత్తం ఆరు జోన్లు ఉండగా కొన్ని జోన్లతో పాటు హెడ్డాఫీసులో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు అందలేదు. బల్దియా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతోనే జీతాలు పడలేదని సమాచారం.  గత నెలలో ఎన్నికలు ఉండటంతో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఆదాయం తగ్గడం కూడా ఇందుకు ఓ కారణమైందన్న చర్చ జరుగుతోంది.  కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వచ్చే నెల నుంచి 1న జీతాలు అందే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు, సిబ్బంది కోరుతున్నారు.