కొత్త ఓటర్ నమోదు ప్రాసెస్ షురూ

కొత్త ఓటర్ నమోదు ప్రాసెస్ షురూ

ముషీరాబాద్, వెలుగు: బూత్ లెవెల్​లో కొత్త ఓటర్ నమోదు ప్రాసెస్​ను బల్దియా చేపట్టింది. బుధవారం ముషీరాబాద్​లోని వివిధ ప్రాంతాల్లో ఓటర్ ఎన్​రోల్​మెంట్, కరెక్షన్స్, అడ్రెస్ చేంజ్, నూతన ఓటర్ నమోదు కేంద్రాల ద్వారా ప్రాసెస్​ను షురూ చేసింది. ఆయా కేంద్రాల వద్ద 18 ఏండ్లు నిండిన యువతతో పాటు ఓటర్ లిస్టులో  మార్పులు చేర్పులు చేసుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

అధికారుల ఆదేశాల మేరకు ఓటర్ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని ఈ నెల 14వ తేదీ వరకు ఉంటుందని సెంటర్ ప్రతినిధులు రాజేందర్, నందకిషోర్ తెలిపారు.