డొక్కా సీతమ్మ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’

డొక్కా సీతమ్మ బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’

దర్శకుడు వి సముద్ర, శివిక ప్రధాన పాత్రలుగా సురేష్ లంకలపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణ తల్లి బువ్వమ్మ’.   సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాదరన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోరి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయి రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  బాలినేని శ్రీనివాసరెడ్డి, రాధికాపతి దాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభు, సాయి విజయేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతిథులుగా హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు.

తన తొలి చిత్రంలోనే  డొక్కా సీతమ్మ పాత్రధారిగా నటించడం అదృష్టంగా భావిస్తున్నా అని శివిక చెప్పింది. ఇందులో సీతమ్మ భర్తగా నటించడం ఆనందంగా ఉందని వి. సముద్ర అన్నారు. మంచి సినిమా తీశామని, ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని దర్శకుడు సురేష్ లంకలపల్లి చెప్పాడు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత అన్నారు.