- మరో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి చేసిన కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మరో ముగ్గురు బీఆర్ఎస్ లీడర్లు ఆదివారం రామకృష్ణాపూర్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గత నెల 17న ఎక్స్అఫిషియో ఓటు వేసేందుకు వెళ్తున్న మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్లు, ట్రాఫిక్ డివైడర్ కోన్స్‌తో బాల్క సుమన్, బీఆర్ఎస్శ్రేణులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇందుకు సంబంధించి బాల్క సుమన్‌తో పాటు మరో 24 మందిపై రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి.
గత నెల 18న సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డి, దొమకొండ అనిల్, రామిడి లక్ష్మికాంత్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా వారికి మంచిర్యాల కోర్టు14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశించడంతో వారిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.ఈ నెల 4న నలుగురికి కోర్టు తీర్పు మేరకు షరతులతో కూడిన బెయిల్మంజూరుచేశారు. ప్రతీ ఆదివారం రామకృష్ణాపూర్ పీఎస్‌లో సంతకాలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుమన్, మరో ముగ్గురు పీఎస్‌కు చేరుకొని సీఐ రమేశ్, ఎస్ఐ శ్రీధర్ సమక్షంలో సంతకాలు చేశారు. ఇదే కేసులో మరో ఐదుగురు జైలులో ఉన్నారు.
