
కేసీఆర్ కు పక్కలో బల్లెంలా ఉండాలంటే బల్మూరి వెంకట్ గెలవాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. విద్యార్థి, నిరుద్యోగులంతా బల్మూరికి ఓటేస్తే.. మీ ప్రతినిధిగా బల్మూరి అసెంబ్లీలో కొట్లాడతారని చెప్పారు. హుజూరాబాద్ లో మాట్లాడారు రేవంత్. కేసీఆర్, రాజేందర్ ది పైసల పంచాయతీ అని విమర్శించారు. పంపకాల పంచాయతీ తప్ప ప్రజలకు పనికొచ్చేది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. హుజూర్ నగర్, సాగర్ లో టీఆర్ఎస్.. దుబ్బాకలో బీజేపీ గెలిచి చేసిందేం లేదన్నారు. బల్మూరికి ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు రేవంత్.