అఫైర్లు, అబార్షన్ రూమర్లపై సమంత రియాక్షన్

అఫైర్లు, అబార్షన్ రూమర్లపై సమంత రియాక్షన్

హైదరాబాద్: అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంతపై పలు రకాల రూమర్లు వస్తున్నాయి. వీటిపై సామ్ తొలిసారి స్పందించింది. అఫైర్లు, అబార్షన్లు అంటూ తనపై పుకార్లు సృష్టిస్తున్న వారిపై ఆమె ఫైర్ అయ్యింది. ఇలాంటి రూమర్లతో తనను ఏమీ చేయలేరని గట్టి కౌంటర్ ఇచ్చింది. విడాకులతో బాధలో ఉన్నానని.. దీని నుంచి బయట పడటానికి తనను ఒంటరిగా వదిలేయాలని కోరింది. ‘నా జీవితంలో ఏర్పడిన సమస్యపై మీరు ఎమోషనల్‌గా స్పందించిన  తీరు నన్ను కదిలించింది. నాపై వస్తున్న తప్పుడు రూమర్లు, దుష్ప్రచారాన్ని అడ్డుకున్నందుకు ధన్యవాదాలు. నాపై మీరు చూపిన సానుభూతికి కృతజ్ఞురాల్ని’ అని తనకు మద్దతుగా నిలిచిన వారికి సమంత థ్యాంక్స్ చెప్పింది. 

‘నాకు అఫైర్లు ఉన్నాయని, నేను పిల్లలు కనొద్దని అనుకున్నట్లు.. నేను అవకాశవాదినని, అబార్షన్లు చేయించుకున్నానని కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు. విడాకులు అనేది ఓ బాధాకరమైన విషయం. దయచేసి దీని నుంచి బయట పడేంత వరకు నన్ను ఒంటరిగా వదిలేయండి. నా మీద దాడి జరుగుతున్న తీరు దారుణంగా ఉంది. కానీ ఇవి నన్నేమీ చేయలేవు’ అని సమంత స్పష్టం చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

మరిన్ని వార్తల కోసం: 

మగాళ్లను ప్రశ్నించే సత్తా లేదా?: సమంత

మంత్రి కొడుకును ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలే?

కేసీఆర్​ సీటుకు ఎసరు పెట్టింది.. హరీశ్​, కేటీఆరే

బార్డర్‌లో బాహాబాహీ: 200 మంది చైనా జవాన్లను అడ్డుకున్న భారత ఆర్మీ