స్కూల్లో ఫోన్ల వాడకంపై నిషేధం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

స్కూల్లో ఫోన్ల వాడకంపై నిషేధం... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడాకాన్ని నిషేదాన్ని విధించింది. టీచర్లు కూడా తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్‌ను ప్రిన్సిపాల్ కు అప్పగించాలని సూచించింది. 

బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఎవరైనా నిబంధనలు ఊల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  ఇటీవలే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఫోన్ల వాడకంపై నిషేదం విధించింది.