మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం

మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం

దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. దీంతో వీటి ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతుల పై నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్టీ) తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది

భారత ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఆర్థిక సంవత్సరం చివరి వరకు ( మార్చి 31)  పొడిగించింది. దేశీయ లభ్యతను పెంచాలని, ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం కోరుతున్నందున ఎగుమతి నిషేధం మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మంగళవారం (ఫిబ్రవరి 20) తెలిపారు.

సార్వత్రిక ఎన్నికలకు ముందు, మార్చి 31 తర్వాత కూడా నిషేధం ఎత్తివేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే రబీ (శీతాకాలం)లో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉల్లి ఎక్కువగా పండే మహారాష్ట్రలో గతేడాది కంటే 40 శాతం తక్కువుగా ఉల్లి పంటను సాగు చేశారు. 

గతేడాది  డిసెంబర్ 8న  ఉల్లి ఎగుమతిపై నిషేధం విధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్‌లో, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి రిటైల్ మార్కెట్‌లలో కిలోకు 25 రూపాయల సబ్సిడీ రేటుతో బఫర్ ఉల్లిపాయ స్టాక్‌ను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ఆగస్టు 2023లో..  భారతదేశం మొదట్లో డిసెంబర్ 31, 2023 వరకు ఉల్లిపాయల ఎగుమతిని నిషేధించింది. కమోడిటీపై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించిందన్న నివేదికల నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గాన్‌లో ఫిబ్రవరి 19న మోడల్ హోల్‌సేల్ ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1,280( ఫిబ్రవరి 17) నుంచి 40.62 శాతం పెరిగి రూ.1,800కి చేరుకుంది.

గతేడాది అక్టోబర్‌లో ఉల్లి ధర  ఒక్కసారిగా పెరిగింది. కిలో రూ.30 నుంచి రూ.35 వరకు విక్రయించిన ఉల్లి ఒక్కసారిగా రూ.70కి చేరింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.  ఆ సమయంలో డిసెంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. దీంతో ధరలు కూడా తగ్గాయి.  గా ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.25 నుంచి రూ.30 వరకు పలుకుతోంది.  ప్రభుత్వం .. నాఫెడ్ ... ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా కిలో ఉల్లిని 25 రూపాయలకు విక్రయించింది. దీంతో సామాన్య ప్రజలకు ఎంతో ఊరట లభించింది.