నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్

నేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్

ఇవాల్టి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూసివేస్తామని కేంద్రం ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. నిబంధనలు తప్పితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు. పర్యావరణ పరిరక్షణ చట్టం కింద జరిమానా, లేదా జైలు శిక్ష విధిస్తామన్నారు. నిషేధాజ్ఞలు అమలుపై జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటవుతాయన్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

మరోవైపు రాష్ట్రాల మధ్య S.U.P  వస్తువుల రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో చెక్ పాయింట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వస్తువుల్లో ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ స్పూన్స్, స్ట్రాలు,ఇయర్ బడ్స్, 100 మైక్రాన్ల లోపు ఉండే ప్లాస్టిక్ పీవీసీ బ్యానర్లతో పాటు మరికొన్ని వస్తువులు వాడకూడదని కేంద్రం ఆదేశాలిచ్చింది.  మరోవైపు అక్రమంగా ప్లాస్టిక్ వస్తువులను తయారి, దిగుమతి, రవాణపై నిఘా పెట్టెందుకు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం. 

మరోవైపు ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు తయారీ పై ఆధారపడి సుమారు 2 లక్షల మంది జీవిస్తున్నారు. ఒకేసారి నిషేదాన్ని విధించడం వల్ల 10 వేల కోట్లకు పైగా నష్టం వస్తుందని ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.