అరటిపండ్లు కూడా కేజీ రూ.100.. సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ కు ధరల మంట

అరటిపండ్లు కూడా కేజీ రూ.100.. సామాన్యుడి బ్రేక్ ఫాస్ట్ కు ధరల మంట

తొక్కలో అరటి పండ్లు.. అరటి పండు తొక్క అంటూ ఇంత కాలం సిల్లీగానే తీసేశారు.. అరటి పండ్లు అంటే ఏదో 30, 40 రూపాయలతో డజను కొనుక్కుని తీసుకెళతాం.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.. అరటి పండ్లు డజను కొనాలంటే 100 రూపాయల నోటు ఉండాల్సిందే.. అవును.. తొక్కలో అరటి పండ్లు అనే వాళ్లు ఇప్పుడు.. అమ్మో అరటి పండ్లు అంటున్నారు జనం. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ధరలు అందుబాటులోనే ఉన్నా.. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అరటి పండ్ల ధరలు అమాంతం పెరిగాయి. కేజీ వంద రూపాయలు పలుకుతున్నాయి. దీంతో సామాన్యుల బ్రేక్ ఫాస్ట్ ఖరీదైంది

మార్కెట్లకు నెల రోజుల క్రితం 1500 క్వింటాళ్ల అరటిపళ్లు  రాగా, ప్రస్తుతం 1000 క్వింటాళ్లకు పడిపోయింది. బెంగళూరు నగరంలో అమ్మే అరటి పండ్లలో చాలా శాతం తమిళనాడు నుంచి సరఫరా అవుతాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకం అరటి పండ్లను బెంగళూరు నగర వాసులు ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తమిళనాడు నుంచి ఈ రకం పండ్ల సరఫరా తగ్గిపోవడంతో అసలు సమస్య మొదలైంది.  

అయితే శ్రావణ మాసం ప్రారంభం కావడం, వరుసగా పండుగలు వస్తు్డటంతో  ఆరటిపళ్ల ధరలు మరింతే పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.   తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు దేశంలోనే అత్యధికంగా అరటి పండించే రాష్ట్రాలు. మహారాష్ట్ర , ఉత్తర ప్రదేశ్ , జమ్మూ కాశ్మీర్‌లకు అరటిపండ్లను సరఫరా చేస్తాయి.   ఇక  హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్‌లో భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి దాదాపు సగానికి తగ్గినప్పటికీ యాపిల్స్ ధర పెరుగుదల కనిపించకపోవచ్చు.