హబ్సిగూడలో బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర

హబ్సిగూడలో బండారి లక్ష్మారెడ్డి పాదయాత్ర

ఉప్పల్, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  గురువారం పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలతో కలిసి హబ్సిగూడ డివిజన్​లో ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరించారు. మరోసారి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఉప్పల్ డివిజన్ పరిధి ఓల్డ్ భరత్ నగర్, కుమ్మరి బస్తీ, నాచారం డివిజన్ ఎర్రకుంటలో ఆయన చేపట్టిన ‘మన బస్తీ – మన బీఎల్ఆర్’ కార్యక్రమానికి విశేష స్పందం దక్కింది. ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్​చార్జి రావుల శ్రీధర్ రెడ్డి, సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి చీఫ్​ గెస్టులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉప్పల్​లో బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శ్రీమతి శాంతి,  సీనియర్ నేతలు అరటికాయల భాస్కర్, సంతోష్ రెడ్డి, సాయిజెన్ శేఖర్  పాల్గొన్నారు. బుధవారం రాత్రి రామంతాపూర్​ డివిజన్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్( ఫుల్ లెవెల్ ట్యాంక్) నిర్వాసితులతో లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు.

తమ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని.. ఇండ్లు మునిగిపోకుండా చూడాలని అక్కడి జనం లక్ష్మారెడ్డిని కోరారు. దీనిపై స్పందించిన లక్ష్మారెడ్డి.. ఎన్నికల తర్వాత సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.