అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేయొద్దు : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేయొద్దు : మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

జీడిమెట్ల, వెలుగు: అభివృద్ధి పేరుతో రైతులకు అన్యాయం చేయొద్దని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని తమ వ్యవసాయ భూములు, ఇళ్ల జాగలను కన్జర్వేషన్​జోన్​నుంచి తొలగించాలని డిమాండ్​చేస్తూ రైతులు శుక్రవారం బౌరంపేట్​లో సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ గవర్నర్​మాట్లాడుతూ.. ప్రభుత్వాలు రైతులకు సహాయం అందించాలి తప్ప ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. అభివృద్ధి అనేది సమగ్రంగా ఉండాలని, కొన్ని ప్రాంతాలకు పరిమితం కావొద్దన్నారు.  

11 జిల్లాలకు హెచ్ఎండీఏ విస్తరణే సరికాదన్నారు. పాలన సక్రమంగా లేక అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు. రైతుల సమస్యను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రభుత్వం  స్పందించకపోతే వేలాది మంది రైతులతో ఉద్యమిస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.