
ముషీరాబాద్,వెలుగు : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. పార్టీ కోసం పదేండ్లుగా పలు కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో చురుగ్గా పాల్గొన్నానని చెప్పారు. పార్టీకి మరింత సేవ చేయడానికి ఇది చక్కటి అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.