బండి సంజయ్ అప్పగింతలు.. ఆఫీసు హ్యాండోవర్, పార్టీ కారు పంపించేశారు

బండి సంజయ్ అప్పగింతలు..  ఆఫీసు హ్యాండోవర్, పార్టీ కారు పంపించేశారు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్  కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తనకు కేటాయించిన ఫార్చ్యూనర్ కారును స్టేట్ బీజేపీ ఆఫీసుకు పంపించారు. అంతేకాకుండా తన ఛాంబర్ ను కూడా  హ్యాండోవర్ చేశారు.  గతేడాది 2022లో టయోటా ఫార్చూనర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాన్ని సంజయ్ కు కైటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ వాహానం కోసం పార్టీ తరుపున రెండుకోట్లు కేటాయించింది. తన అధ్యక్ష పదవి ముగియడంతో బండి సంజయ్ తిరిగి దానిని పార్టీకి అప్పగించారు.  

రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది హైకమాండ్.  దాదాపు మూడున్నరేళ్లుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు సంజయ్.  ఢిల్లీలో నడ్డాతో ముగిసిన భేటీ అనంతరం సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.  అధ్యక్ష పదవికి సంబంధించిన మార్పులను బండి సంజయ్ కు వివరించారు జేపీ నడ్డా. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్ సేవలను కేంద్రంలో వినయోగించుకోనున్నారు పార్టీ పెద్దలు.