కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిధులు పంపిస్తోంది కేసీఆరే

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిధులు పంపిస్తోంది  కేసీఆరే

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు నిధులు పంపిస్తోంది సీఎం కేసీఆరే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గతంలో జేడీఎస్ కు మద్దతిస్తామని  చెప్పి వాళ్లకు కేసీఆర్ హ్యాండిచ్చారని మండిపడ్డారు. కర్ణాటక ఎన్నికలుంటే మహారాష్ట్రలో తిరిగిన కేసీఆర్.. అక్కడ జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ గెలవలేదని చురలంటించారు. రాష్ట్రంలో  రైతులు అకాల వర్షాలతో నష్టపోయి ఏడుస్తుంటే.. రాజకీయాల కోసం సీఎం కేసీఆర్ ఢిల్లీ పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన 3వేల కోట్ల రూపాయల ఎన్డీఆర్ఎఫ్ నిధులు రాష్ట్రంలో ఎంతమంది రైతులకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లలో నష్టపోయిన ఒక్క రైతును కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు. కరీంనగర్ చైతన్యపురి కాలనీలో ఈ-సేవా భవన ప్రహరీని ప్రారంభించిన బండి సంజయ్. 

మాటలు తప్ప చేతులు లేవు..

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటానని..ఎకరాకు పదివేల సాయం ప్రకటిస్తానని కేసీఆర్ ప్రకటించినా..ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ మాటలు తప్ప చేతలు లేవన్నారు. ముందే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఉంటే 30 శాతం పంట కాపాడగలిగేవారని చెప్పారు. మిడ్ మానేరు నిర్వాసితులు 17 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారని...వాళ్లకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నేరవేర్చడం లేదన్నారు.  మిడ్ మానేరు నిర్వాసితుల్లో కేసీఆర్ అత్తగారి ఊరు కూడా ఉందని....వాళ్లంతా పిల్లనిచ్చిన పాపానికి మోసం చేసాడని బాధపడుతున్నారని చురకలంటించారు.  మిడ్ మానేరు నిర్వాసితులకు ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పిన  ప్రతిపాదన ఏమైందని ప్రశ్నించారు.  మిడ్ మానేరు నిర్వాసితుల న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

రైతులు గుర్తించారు..

రాష్ట్రంలో ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేస్తుందని రైతులు గుర్తించారని బండి సంజయ్ అన్నారు. రైతులకు గోనేసంచి, సుతిల్ దారం సహా ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందని వెల్లడించారు. రైతులకు మేలు జరిగితే బీజేపీకి ఓటేస్తారన్న భయంతో వారిని ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా..వాటిల్లో కనీస వసతులు లేవని మండిపడ్డారు.ఇతర రాష్ట్రాల్లో మద్ధతు ధరకు అదనంగా బోనస్ ఇస్తున్నారని... ఇక్కడెందుకు ఇవ్వరని ప్రశ్నించారు. 1600 కోట్లతో సెక్రటేరియట్ కడితే అదికూడా వాన నీటికి కురుస్తోందని చురకలంటించారు.