
ప్రతిపక్ష నేతలు కలుసుకోవడం చాలా అరుదు. ఎప్పుడు విమర్శ ప్రతి విమర్శలు చేసుకునే నాయకులు కలుసుకుంటే చూడటానికి ఆసక్తికరంగానే ఉంటుంది. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద అలాంటిదే ఒక అరుదైన సంఘటన జరిగింది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఒకేసారి తారసపడ్డారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని కాసేపు నవ్వుతూ పలకరించుకున్నారు. ఎంపీ కేశవరావును కూడా రేవంత్ రెడ్డి కలిశారు. తరచూ ఒకరిపై మరొకరు సంచలన ఆరోపణలు చేసుకునే నాయకులు సరదాగా సంభాషించుకోవడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడేందుకు వెళ్తుండగా ఒకేసారి ఎదురుపడ్డారు. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.