మంచి చేయాలని చెప్తే దాడి చేస్తారా..?

 మంచి చేయాలని చెప్తే దాడి చేస్తారా..?
  • ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ ని పరామర్శించిన బండి సంజయ్
  • దాడి చేసిన గూండాలపై 307 కేసు పెట్టాలి
  • కేసీఆర్ కు విజ్ఞత ఉంటే సురేశ్ కుటుంబ సభ్యులను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్

హైదరాబాద్: మంచి చేయాలని చెప్తే దాడులు చేప్తే దాడులు చేస్తారా..  ప్రశ్నించినా దాడులు చేస్తారా.. ? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండాల దాడుల్లో గాయపడి ఇందిరా పార్క్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓయూ జేఏసీ విద్యార్థి సురేష్ యాదవ్ ని బుధవారం బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బలిదానాలకు తెగించి కొట్లాడిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన భూమిక పోషించిన విద్యార్థులపై రాక్షస ముఖ్యమంత్రి డైరెక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గుండాల దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నీ పతనం మొదలైంది.. నీ పై కూడా దాడులు చేసే రోజు వస్తుందని ఆయన హెచ్చరించారు. సురేష్ యాదవ్ పై దాడి జరగడం ఇది  రెండోసారి, తెలంగాణలో అనుకున్న లక్ష్యాలు నెరవేరడం లేదని ప్రశ్నిస్తే దాడి చేశారని విమర్శించారు. గూండాలు బరితెగించి రోడ్లపై దాడులు చేస్తుంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తోందన్నారు. 20 మంది గుండాలు ప్రజలందరూ చూస్తుంటే బహిరంగంగా డాడీ చేశారని, ముఖ్యమంత్రి దీన్ని ఎందుకు ఖండించలేదన్నారు. హాస్పిటల్ కి వెళితే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయరు, ఏమిటి ఇది..? సురేష్ వాళ్ల అమ్మ ,అన్నను తీసుకు వచ్చి ఉల్టా కేసు పెట్టే ప్రయత్నం కెసిఆర్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం క్రిమినల్స్ ని ప్రభుత్వం పెంచి పోషిస్తోందన్నారు. సురేష్ యాదవ్ పై దాడి చేసిన గుండాలను అరెస్టు చేయాలని,  వారిపై 307 కేసు పెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి విజ్ఞత ఉంటే సురేశ్ కుటుంబ సభ్యులను మాటలతో వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.