2024 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్!

2024 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్!

రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు 2024లో జరగనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగనున్నారని పార్టీ వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే.. బండి సంజయ్ నేతృత్వంలోనే బీజేపీ రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కొనుంది. రాష్ట్రంలో బీజేపీని బాలోపేతం చేయడానికి జాతీయ నేతలు కూడా సన్నద్దమౌతున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర ఇన్చార్లుగా ముగ్గురు జాతీయ నేతలు ఉన్నారు. 

కాగా, బండి సంజయ్ నేతృత్వంలో ఇప్పటికే ప్రజాగోస బీజేపీ భరోసా నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రతీ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100కు తగ్గకుండా సభలు జరుపనున్నారు. ఈ సమావేశాలకు కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు నేతలు రంగంలోకి దిగుతున్నారు.