కొన్ని రోజులు పాదయాత్ర ఆపాలని ఈటలను కోరినం

V6 Velugu Posted on Jul 31, 2021

హుజురాబాద్ లో అడ్డదారుల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ నేతలు  ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఈటల ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. అపోలో ఆస్పత్రిలో ఈటలను పరామర్శించిన ఆయన.. కొన్ని రోజులు పాదయాత్ర ఆపాలని ఈటలను కోరామన్నారు సంజయ్.  అనారోగ్యం నుంచి కోలుకున్నాక మళ్లీ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని ఈటలకు సూచించినందున ఆస్పత్రికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు రావొద్దన్నారు. ఈటల ప్రజాస్వామ్య పద్దతిలో గెలుస్తారన్నారు. పాదయాత్రతో ప్రజల దగ్గరకువెళ్లి ఆశీర్వాదం తీసుకోవాలనేదానికి ఈటల కట్టుబడి ఉన్నారన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. 
 

Tagged Bandi Sanjay, Eatala Rajender, padayatra, fewdays

Latest Videos

Subscribe Now

More News