బీజేపీ అధికారంలోకి వచ్చాక సంచార జాతులను ఆదుకుంటాం

బీజేపీ అధికారంలోకి వచ్చాక సంచార జాతులను ఆదుకుంటాం

సంచార జాతులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నాడు. ఎంబీసీ కార్పొరేషన్కు ఏటా రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని కేవలం రూ. 67 కోట్లు ఇచ్చాడని మండిపడ్డారు. జనగామ జిల్లా చీటకోడూరులో సంచార జాతులతో బండి సంజయ్ రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికారంలోకి వచ్చాక సంచార జాతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సంచార జాతులు తలుచుకుంటే  రాజ్యం మారుతుందన్న బండి సంజయ్... సంచార జాతులన్నీ ఇంటింటికీ తిరిగి కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని పిలుపునిచ్చారు. 

బీసీల ద్రోహి కేసీఆర్..
సంచార జాతుల బాధలు చూస్తే దు:ఖమొస్తుందని బండి సంజయ్ అన్నారు. ఏడాది కాలంగా తనది సంచార బతుకే అని చెప్పారు. సంచార జాతుల కష్టాలు ఎలా ఉంటాయో స్వయంగా చూస్తున్నానన్నాడు. బీసీల ద్రోహి కేసీఆర్ పాలనకు చరమ గీతం పాడతామన్నారు.  కులవృత్తులను కేసీఆర్ నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. తెలంగాణకు ప్రధాని మోడీ  రెండు లక్షల 40 వేల ఇళ్లు ఇస్తే..వాటిని కూడా కేసీఆర్ కట్టించడం లేదని చెప్పాడు.