మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకి.. లేడీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
  • కుటుంబ సమస్యలే కారణం!

ఉప్పల్, వెలుగు: మూడంతస్తుల బిల్డింగ్​పైనుంచి దూకి ఓ మహిళా కానిస్టేబుల్​ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రవిపహార్​తండాకు చెందిన ప్రమీల(32) ఉప్పల్​ పద్మావతికాలనీలోని అపార్ట్​మెంట్ లో భర్త బాలాజీ, పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. ప్రస్తుతం నాచారం పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న ఆమె సోమవారం తాను నివాసం ఉంటున్న మూడంతస్తుల బిల్డింగ్ పైనుంచి కిందకు దూకింది. 

తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను సమీప హాస్పిటల్​కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం యశోధ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించారు.