అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. అరుణాచలం యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళుతుండగా..

అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. అరుణాచలం యాత్ర ముగించుకొని హైదరాబాద్ వెళుతుండగా..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా దగ్గర అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఇన్నోవా క్రిష్టా వాహనాన్ని ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదు మందిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి.

మృతులను రంగారెడ్డి జిల్లా తుర్క ఎంజాల్కు చెందిన పుల్లగుర్రం పురుషోత్తం రెడ్డి, గంగిరెడ్డి మధుసూదన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. అరుణాచలం నుంచి యాత్ర ముగించుకొని హైదరాబాదు  వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

* అర్ధ రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఇద్దరు మృతి

* మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

* రంగారెడ్డి జిల్లా రాయికల్ టోల్ ప్లాజా దగ్గర చోటు చేసుకున్న ప్రమాదం