గిగ్ వర్కర్ల సమస్యలు కేంద్రం పరిష్కరించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్ల సమస్యలు కేంద్రం పరిష్కరించాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     కంపెనీలతో కేంద్రం చర్చలు జరపాలి: కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి
  •     వారి భద్రతపై రాష్ట్ర కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకున్నాం
  •     జోడో యాత్రలో రాహుల్ గాంధీ గిగ్​వర్కర్లతో చర్చించారని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్ల సమస్యలపై కేంద్రం కంపెనీలతో చర్చలు జరిపి పరిష్కరించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న ఆందోళనలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.  స్విగ్గి, జోమాటో కంపెనీలు గిగ్ వర్కర్ల ఇన్ కమ్ ను తక్కువ చేశాయని, అందుకే ఆందోళనలకు వెళుతున్నాయన్నారు. 

ప్రస్తుతం గిగ్ వర్కర్ల ఇన్ కమ్ తక్కువ ఉండటం, వాళ్ల ఇన్ కమ్ తక్కువ చేయటంతో పని ఒత్తిడి ఎక్కువ ఉందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వీళ్లకి ఉద్యోగ భద్రత లేదన్నారు. ఇన్సెంటివ్ వచ్చే టైమ్ లో వీరిని తొలగిస్తున్నారని ఆయన తెలిపారు.

సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల తో చర్చించారని, ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామన్నారు. వీరి భద్రతకు తీసుకోవాల్సిన అన్ని చర్యలపై రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. ఈ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు, హెల్త్ కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.