కాంగ్రెస్ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు

కాంగ్రెస్ నేతలపై ఎస్పీకి ఫిర్యాదు

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తదితరులతో కలిసి జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రాకు సోమవారం ఫిర్యాదు చేశారు. 

కోటపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ భర్తపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాలను పింక్ బుక్​లో నమోదు చేసుకుంటున్నామని, బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.