
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. బుధవారం ( ఆగస్టు 27 ) నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి, మెదక్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పలు చోట్ల వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న క్రమంలో రహదారులు, రైల్వే ట్రాకులు సైతం తెగిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఆర్మీ హెలికాఫ్టర్ల కోసం రక్షణ శాఖను కోరారు అధికారులు. ఆర్మీ హెలికాఫ్టర్ల రాక ఆలస్యం అవుతున్న క్రమంలో. హెలికాఫ్టర్లు త్వరగా పంపాలని కోరుతూ రక్షణ శాఖ అధికారులకు ఫోన్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్.
తెలంగాణకు మూడు హెలికాప్టర్లను రడీ చేశామని.. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం అనుకూలించక పోవడం తో బాధిత ప్రాంతాలకు చాపర్ల రాక ఆలస్యమవుతోందని వివరించారు రక్షణ శాఖ అధికారులు. ప్రత్యామ్నాయ స్టేషన్ల నుండి చాపర్లను రప్పించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు అధికారులు. నాందెడ్, బీదర్ స్టేషన్ల నుండి చాపర్లను పంపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు అధికారులు.
Also Read : వరదలపై సీఎం రేవంత్ అత్యవసర సమీక్ష
భారీ వర్షాలతో SRSP, మానేరు నదులకు విపరీతంగా వరద వస్తోందని అధికారులకు తెలిపారు బండి సంజయ్. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చేపట్టిన చర్యలకు.. NDRF బృందాలు పూర్తి సహాయ ఆశకరాలు అందిస్తున్నాయని తెలిపారు బండి సంజయ్.వీలైనంత తొందరగా చాపర్లను పంపాలని కోరారు బండి సంజయ్.