
- దళిత రైతు ఆత్మహత్య కలచివేసింది: బండి సంజయ్
- గురువారం MRO కార్యాలయాల ముందు నిరసన పిలుపు
టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై కొనసాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లోని MRO కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణిచివేత దాడులు కొనసాగుతున్నాయని, గురువారం సీఎం నియోజకవర్గం గజ్వేల్ లో వేలూరు గ్రామానికి చెందిన నరసింహులు అనే పేద దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం అందుకు మరో ఉదాహరణ అని చెప్పారు.
తన 13 గుంటల భూమిని లాక్కుంటున్నరని, అందుకే చనిపోతున్నానని వీడియో తీసి మరీ ఆ దళిత ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తుందన్నారు. దళితులకు ఉచితంగా మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామన్న సీఎం కేసీఆర్.. ఉన్న భూమిని కూడా లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమని అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, భరోసా నింపడానికి వెళ్తున్న బిజెపి నాయకులను మార్గమధ్యలోనే అడ్డగించి అరెస్టు చేయడం టిఆర్ఎస్ నియంతృత్వ వైఖరికి అద్దం పడుతుందని అన్నారు సంజయ్.