
హైదరాబాద్: రీ డిజైన్ల పేరుతో అంచనాలు పెంచి, ప్రాజెక్ట్ లలో చేసిన అవినీతికి, తిన్న కమీషన్లకు సీఎం కేసీఆర్ జైల్ కు పోవడం ఖాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడిన ఆయన.. కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రభుత్వం కుమ్మక్కయ్యిందని ఆరోపించారు. అధిక పీజులు వసూలు చేసిన ఒకట్రెండు ఆస్పత్రులను సీజ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విమర్శించారు. గణేష్ ఉత్సవాల్లో కరోనా పెరిగిందని ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తోందన్నారు. రంజాన్ సమయంలో కరోనా కేసులు తగ్గించి చూపించారన్నారు. 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పని చెయాలన్న బండి సంజయ్.. 2023లో తెలంగాణలో కాషాయం జెండా ఎగుర వేయడం ఖాయమన్నారు.
ప్రజాస్వామ్య పాలన, పేదలకు అందుబాటులో ఉండే పాలన, బీజేపీ ద్వారానే సాధ్యమని..రాష్ట్రంలో కుటుంబ పాలనను , ఈ రాక్షస పాలన ప్రజలు వద్దనుకుంటున్నారని తెలిపారు. ఈ రాక్షస పాలనపై పదాధికారులు, కార్యకర్తలు ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గణేశ్ ఉత్సవాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జరుపుకొనివ్వడం లేదని..హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు కేసీఆర్ చేస్తున్నారన్నారు. ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు బండి సంజయ్.