
బీజేపీలో గ్రూపులు ఉన్నాయనే ప్రచారం చేస్తున్నది సీఎం కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ ని తట్టుకోలేక కేసీఆర్ ఎంఐఎం, కాంగ్రెస్ లను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ లో బహిరంగసభలో బండి సంజయ్ పాల్గొన్నారు.
రైతుబందు పేరుతో అన్ని రకాల సబ్సీడీలు ఎత్తివేసిన ఘనత కేసీఆర్ దేనని బండి సంజయ్ విమర్శించారు. కారు.. సారు... 60 పర్సెంట్ సర్కార్ గా బీఆర్ఎస్ మారిందన్నారు. పక్క రాష్ట్రం పారిపోవటానికి కేసీఆర్ సిద్దమయ్యారని అన్నారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని విమర్శించారు.
కాంగ్రెస్,బీఆర్ఎస్ ది పినాయిల్ బంధమన్నారు బండి సంజయ్ . కాంగ్రెస్ పార్టీ షాపింగ్ మాల్ లాంటింది..అలాంటి పార్టీ ఎమ్మెల్యేలను ఎవరైనా కొనుగోలు చేస్తారన్నారు. కర్ణాటకలో 12 శాతం ఉన్న ముస్లింలు ఏకమైతే తెలంగాణలో 80 శాతం ఉన్న హిందువులు ఎందుకు ఏకం కాకూడదని బండి సంజయ్ ప్రశ్నించారు. అధికారం ఉన్నోళ్ల పంచన చేరటం తప్ప ఎంఐఎం పేద ముస్లింలకు చేసిందేమీ లేదన్నారు. దమ్ముంటే మక్తల్ నుంచి పోటీ చెయ్యాలని ఎంఐఎం కి బండి సంజయ్ సవాల్ విసిరారు.