
హైదరాబాద్: కోఠిలోని కరోన కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద నిరసనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్..కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని.. కరోనా పరీక్షలు చేయటంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా పరీక్షలు చేస్తోంటే.. తెలంగాణలో వేల సంఖ్యలో కూడా చేయలేదని సంజయ్ విమర్శించారు.
కరోనా కట్టడిపై ప్రభుత్వ పెద్దలతో చర్చకు సిద్ధమన్నారు. కరోనా అంటే.. ఓనర్లకు, క్లీనర్లకు మధ్య యుద్దం కాదని మంత్రి ఈటల గుర్తుంచుకోవాలన్నారు. జేపీ నడ్డా నిజాయితీని ప్రశ్నించే హక్కు మంత్రులకు లేదన్నారు. మన సీఎం పారసీటమాల్ ముఖ్యమంత్రని..ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతగదన్నారు. డాక్టర్లు వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారుకానీ..కనీస సౌకర్యాలు కరువయ్యాయని తెలిపారు. అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పిపిఈ కిట్లు మాస్కులు కూడా లేవని డాక్టర్లు ధర్నాలు చేశారని.. రాష్ట్ర సీఎం, మంత్రులు జోకర్లలాగా మారారన్నారు. హెల్త్ బులెటిన్ కూడా ఇష్టం వచ్చినట్లు విడుదల చేస్తున్నారని.. అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్ తన అహాన్ని వీడి.. వైద్యులు, పోలీసులను కాపాడాలన్నారు. బండి సంజయ్ వెంట వచ్చిన మిగతా బీజేపీ నేతలు,కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.