
RTC సమ్మెకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు ఇది నిదర్శనం అన్నారు. ఈ దాష్టీకం అంతా రజాకార్ల విధానాన్ని తలపిస్తోందన్నారు.
సకల జనుల సమ్మె స్ఫూర్తితో సాధించిన ప్రత్యేక తెలంగాణలో మరో విమోచన పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు. కేసీఆర్ దమననీతిపై ప్రజాస్వామిక పద్ధతిలో గాంధేయవాద ఉద్యమాలు నిర్మించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాచరిక పాలనతో కేసీఆర్ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు బండి సంజయ్.