మీడియేషన్ చట్ట బలహీనత కాదు.. ఉన్నత పరిణామం..సీజేఐ సూర్యకాంత్

మీడియేషన్ చట్ట బలహీనత కాదు.. ఉన్నత పరిణామం..సీజేఐ సూర్యకాంత్
  • ప్రస్తుత కాలంలో అది ఎంతో ముఖ్యం: సీజేఐ సూర్యకాంత్

పనాజీ: చట్టం యొక్క బలహీనతకు మధ్యవర్తిత్వం సంకేతం కాదు, బదులుగా అది చట్టం యొక్క అత్యున్నత పరిణామం అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ శుక్రవారం అన్నారు. గోవాలోని సంకోలే గ్రామంలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ నిర్వహించిన ‘మధ్యవర్తిత్వం: ప్రస్తుత కాలంలో ఎంత ముఖ్యం’ అనే సమావేశంలో ఆయన మాట్లాడారు.

“మధ్యవర్తిత్వం చట్టం యొక్క బలహీనతకు సంకేతం కాదు, బదులుగా అది దాని అత్యున్నత పరిణామం. ఇది న్యాయనిర్ణయ సంస్కృతి నుంచి పార్టిసిపేట్ అయ్యే కల్చర్​కు నిజమైన మార్పు, ఇక్కడ మనం సామరస్యాన్ని పెంపొందిస్తాం” అని సీజేఐ అన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మల్టీ-డోర్ కోర్టుహౌస్ వైపు మార్పును ఊహిస్తున్నట్లు చెప్పారు. 

అక్కడ కోర్టు కేవలం విచారణల స్థలం కాకుండా, వివాదాల పరిష్కారానికి సమగ్ర కేంద్రంగా మారుతుంది. రోజు ముందు భాగంలో, పనాజీలోని కళా అకాడమీ సమీపంలో ‘మధ్యవర్తిత్వ అవగాహన’ పై నిర్వహించిన వాక్​లో సీజేఐ పాల్గొన్నారు. “మధ్యవర్తిత్వం విజయవంతమైనదని, తక్కువ ఖర్చుతో ఆమోదం పొందుతుందని,  ఇది రెండు పక్షాలకు ‘విన్–విన్’​ పరిస్థితి” అని అన్నారు.