నాకు 48 గంటలు టైమివ్వడం కాదు.. నీ చీకటి రహస్యాలు బయటపడే టైమొచ్చింది: కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్

నాకు 48 గంటలు టైమివ్వడం కాదు.. నీ చీకటి రహస్యాలు బయటపడే టైమొచ్చింది: కేటీఆర్కు బండి సంజయ్ కౌంటర్

బీఆర్ఎస్ నేత కేటీఆర్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. విమర్శలకు ప్రతి విమర్శలతో ట్వీట్ల దాడులు చేసుకుంటున్నారు. శుక్రవారం (ఆగస్టు 08) ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు సాక్ష్యం చెప్పిన బండి సంజయ్.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బండి సంజయ్ కు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. క్షమాపణ చెప్పి వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులు పంపుతానని హెచ్చరించారు కేటీఆర్. 

కేటీఆర్ హెచ్చరికలకు అంతే స్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. చట్టవిరుద్ధమైన పనులన్నీ చేసి లీగల్ నోటీసుల గురించి మాట్లాడటానికి ట్విట్టర్ టిల్లుకు సిగ్గుండాలని మండిపడ్డారు.  కేటీఆర్ ను ట్విట్టర్ టిల్లు అని సంబోధించిన బండి..  లీగల్ నోటీసుల వెనుక దాక్కునే పిరికోడు కేటీఆర్ అని ధ్వజమెత్తారు. తనకు 48 గంటల టైమివ్వడం కాదని.. కేటీఆర్ చీకటి రహస్యాలు బయటపడే టైమొచ్చిందని అన్నారు. అప్పుడు దాచడానికి ఏమీ ఉండవని చెప్పారు. 

►ALSO READ | 48 గంటలు టైం ఇస్తున్నా.. నిరూపించు లేదా క్షమాపణ చెప్పు: బండి సంజయ్‌కు కేటీఆర్‌ ఛాలెంజ్

కేటీఆర్ గతంలో కూడా లీగల్ నోటీసులంటూ ఏవేవో విఫల ప్రయత్నాలు చేశాడని అన్నారు. కేటీఆర్ కోతి చేష్టలకు బయటపడేటోడు బండి సంజయ్ కాదని అన్నారు. సొంత చెల్లి ఫోన్ ట్యాప్ చేశారని.. ఆ విషయం కేటీఆర్ చెల్లి కవితే అంగీకరించిందని గుర్తు చేశారు. రాఖీ పండుగకు చెల్లి వస్తుందనే భయంతో ముఖం చెల్లక పారిపోతున్నాడని మండిపడ్డారు. 

చేసిన తప్పులను సమర్థించుకోవడం కోసం, బీజేపీలో పార్టీని విలీనం కోసం వేడుకోవడం.., సీఎం అయ్యేందుకు ప్రధాని ఆశీర్వాదం కోరుకోవడం అంత సులభమనుకున్నావా  కేటీఆర్ అంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు బండి సంజయ్.