కేసీఆర్ పెడితే పెండ్లి కోరుతారు.. లేకపోతే చావు కోరుతారు

కేసీఆర్ పెడితే పెండ్లి కోరుతారు.. లేకపోతే చావు కోరుతారు

సీఎం కేసీఆర్ కు భయం మొదలైందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. ఈటల రాజీనామా తర్వాత సీఎం ఫాంహౌజ్ నుంచి బయటికి వస్తున్నారన్నారు.  హుజురాబాద్ బైపోల్ వ్యూహాలపై నేతలతో చర్చించిన బండి సంజయ్.. సీఎంతో సహా ఏ మంత్రి పనిచేయనప్పుడు ఈటల హాస్పిటల్స్ కు వెళ్లారన్నారు.అమర వీరుల రక్తపు మడుగుల్లో కేసీఆర్ రాజ్యమేలుతున్నారన్నారు. సర్పంచ్ తో మాట్లాడే స్థాయికి కేసీఆర్ వచ్చారంటే ఈటలనే కారణమన్నారు.ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపీనేనన్నారు.టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు. చాలా మంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. గడీల పాలన నుంచి బయటికి రమ్మని ఈటలకు ఎప్పుడో పిలుపునిచ్చానన్నారు.ఈటల గడీలను బద్దలు కొట్టి బయటకి వచ్చారన్నారు. హుజురాబాద్ అభివృద్ధి చెందకుండానే ఈటల ఇన్నిసార్లు గెలిచారా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ లో ఎవరూ సంతృప్తిగా లేరని..క్యూ పెద్దగానే ఉందన్నారు. రేషన్ కార్డుల మీద మోడీ ఫోటో పెట్టాల్సిందేనన్నారు. కేసీఆర్ పెడితే పెండ్లి కోరుతారు లేకపోతే చావు కోరుతారన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతీ పైసా కేంద్రమే ఇస్తోందన్నారు. కేంద్రం వాటా లేని సంక్షేమ పథకం ఏంటో కేసీఆర్ చెప్పాలన్నారు. హుజురాబాద్ గడ్డమీద కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు.