ఎంపీ సంతోష్ తెలంగాణ ఉద్యమంలో ఏంజేసిండని రాజ్యసభ ఇచ్చినవ్

ఎంపీ సంతోష్ తెలంగాణ ఉద్యమంలో ఏంజేసిండని రాజ్యసభ ఇచ్చినవ్

హైదరాబాద్: కేసీఆర్ ను ఓడగొట్టాలంటే టీఆర్ఎస్ వ్యతిరేఖ శక్తులంత ఏకం కావాలన్నారు బీజపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. శుక్రవారం  సంజయ్‌ సమక్షంలో కపిలవాయి దిలీప్ కుమార్ బీజేపీలో జాయిన్ అయ్యారు.  తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్..  కుటుంబ పాలన అంతమొందాలంటే ఈ MLC ఎన్నికలు తో ప్రతిష్టాత్మకమన్నారు. మేధావి వర్గం ఆలోచించాలన్న సంజయ్..ఎట్టి పరిస్థితుల్లోనూ TRS గెలవకూడదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోను, GHMC ఎన్నికల్లోనూ ఓటమి పాలైన కేసీఆర్..ఇప్పుడు MLC ఎన్నికల్లో గెలిస్తే కేసీఆర్ కు అహంకారం పెరుగుతుందన్నారు. సామాన్య ప్రజలు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించారని..మేధావి వర్గం ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నానన్నారు. వరంగల్ MLC ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ప్రేమెందర్ రెడ్డికి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయట్ MLC ఎన్నికల్లో  రాంచందర్ రావుకు ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు.

కేసీఆర్ కు PV నర్సింహరావుపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అని ప్రశ్నించిన సంజయ్.. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పీవీ నర్సింహరావు కోసం ఏమి జేసినవో ప్రజలకు జెప్పాలే అన్నారు.! పీవీ నరసింహారావు జయంతి పేరుతో ఒక కార్యక్రమం చేసి, రాష్ట్రమంతా కార్యక్రమాలు చేసిన అన్నవ్ ఎక్కడ చేసినవో చెప్పు? అన్నారు. 10 కోట్లు ఏడా ఖర్చు పెట్టినవో కూడా చెప్పాలన్నారు. MIM అక్బరుద్దీన్ PV నర్సింహరావు ఘాట్ ను కూల్చి వేస్తామని హెచ్చరిస్తే ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా? ఎందుకు స్పందించలేదన్నారు.

PV నర్సింహ రావును అవమాన పరిచేలా MIM అక్బరుద్దీన్ మాట్లాడిండని..MIM ఓట్లు కావాలి కాబట్టే కేసీఆర్ స్పందించలేదన్నారు. ఓడిపోయే సీట్ లో PV నర్సింహరావు కూతురును పోటీ చేపిస్తున్నడని..నీ బిడ్డ కవితని మాత్రం గెలిచే సీట్లో పోటీకి పెట్టావన్నారు. ఎంపీ సంతోష్ తెలంగాణ ఉద్యమంలో ఏమి పీకిండని రాజ్యసభ ఇచ్చినవ్ అన్నారు. PV నర్సింహరావు కూతురుకు ఎందుకు రాజ్య సభ ఇవ్వలేదో ఇవ్వన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీకి ఓటు వేయాలని గ్రాడ్యుయేట్ వోటర్లు డిసైడ్ అయ్యారన్నారు బండి సంజయ్.