కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు

కేసీఆర్ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు

రాష్ట్ర ప్రభుత్వం ఖాజానా నింపుకునేందుకే తప్పుడు విద్యుత్ చార్జీలు విధించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. స్లాబ్ ల పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుందన్న ఆయ‌న‌.. కేసీఆర్ వ‌డ్డీ వ్యాపారిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఇస్తే.. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు. ప్రతిపక్ష పార్టీలు శాంతియుతంగా ఆందోళన చేస్తే, నిర్బంధం విధిస్తూ అరెస్టులు చేస్తున్నారని మండిప‌డ్డారు.

ప్రభుత్వం దిగి వచ్చే వరకు బీజేపీ ఉద్యమిస్తుందని.. ఈ బిల్లులు మొత్తం ప్రభుత్వమే భరించాలన్నారు. లాక్ డౌన్ తో ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉంటే.. విద్యుత్ చార్జీల పేరుతో వ‌సూల్ చేయ‌డం దారుణ‌మ‌న్నారు. రూ. 3వందల కోట్లను ప్రజల నుంచి వసూలు చేయాలని కేసీఆర్ స‌ర్కార్ కుట్ర పన్నింద‌న్నారు బండి సంజ‌య్.