
హైదరాబాద్ : పాస్ పోర్ట్ బ్రోకర్ రాష్ట్ర సీఎం అయ్యారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ బీసీల గోస సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. పేద ప్రజల బాధలు కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే బీసీని పార్టీ అధ్యక్షుడిని చేయాలన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దింపుతామన్న బండి సంజయ్..రాష్ట్రంలో ఒక్క కుల సంఘాన్ని నిర్మించిన పాపాన పోలేదన్నారు. హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు.
హైదరాబాద్ లో వరదలు వచ్చి పేద ప్రజల ఇండ్లు మునిగినా కేసీఆర్ కనీసం బయటికి రాలేదన్నారు. దుబ్బకలో ఇచ్చిన తీర్పే గ్రేటర్ ఎన్నికల్లో ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవడం కోసమే కేసీఆర్ యాగాలు చేస్తున్నాడని…బీసీలంతా టీఆరెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో బీజేపీ గెలవబోతోందన్నారు. అబద్దాలు చెప్పే సీఎం ఈ రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. దుబ్బాక ప్రజలు గొప్ప నిర్ణయం తీసుకున్నారని..తెలంగాణ గడ్డతో పాటు మొన్న జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందన్నారు. దుబ్బాక బై ఎలక్షన్ ఫలితం నుండి తెలంగాణకు మహర్దశ ప్రారంభమైందన్నారు. గొల్ల కర్మలకు ఇచ్చిన గొర్ల స్కీంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీసీల కోసం నరేంద్రమోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీసీల పేర్లతో సంఘాలు పెట్టుకుని దుకాణాలు నడిపిస్తున్న వాళ్లలో బండి సంజయ్ ని అరెస్ట్ చేస్తే ఒక్కరు కూడా వ్యతిరేకించలేదన్నారు..కేసీఆర్ అహంకారానికి దుబ్బాకలో తగిన బుద్ధి చెప్పారన్నారు బండి సంజయ్.