
రామరాజ్యస్థాపన దుబ్బాక నుండే మొదలవుతుందన్నారు బండి సంజయ్. దుబ్బాకలో బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ కు అర్థమైందన్నారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా చేగుంట మండలంలో బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకకు కేంద్రం 280 కోట్లు రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓయూలో ఐనా, దుబ్బాకలో ఐనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.