పోలీసులపై ఆగ్రహం.. టీఆర్ఎస్ వాళ్లకే రక్షణ కల్పిస్తారా

పోలీసులపై ఆగ్రహం.. టీఆర్ఎస్ వాళ్లకే రక్షణ కల్పిస్తారా

ప్రధాని మోడీ ఆలోచనతోనే మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించామన్నారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గాంధీ సంకల్ప యాత్రను చేపట్టారు. అయితే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పదిమంది కూడా లేని కాంగ్రెస్ కార్యకర్తలు సంకల్ప యాత్రను అడ్డుకోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసాడు. కేవలం టీఆర్ఎస్ వాళ్లకే రక్షణ కల్పిస్తారా అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేషమైన స్పందన వస్తోందన్నారు బండి సంజయ్. రాష్ట్రంలో విచిత్రమైన పాలన నడుస్తోందన్న ఆయన..పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మొత్తం సమస్యల వలయంగా మారిందన్నారు.అకాల వర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని… నష్టపోయిన పంటలను ప్రభుత్వం ఇంతవరకు పరిశీలించక పోగా..సర్వేల పేరుతో సీఎం కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ భీమా యోజన పథకం ద్వారా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మె పై మాట్లాడిన సంజయ్ ..ఆర్టీసీ కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను హైకోర్టు గుర్తించినా..రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీలు,మున్సిపాలిటీలు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ లపై కాషాయపు జెండా ఎగురడానికి ఈ సారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను కోరారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ పై ఫైర్ అయ్యారు ఎంపీ బండి సంజయ్ . బీజేపీ పార్టీని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్.. గాడ్సే పార్టీ అంటున్నారు. బీజేపీ పార్టీ మాత్రం గాంధీ ఆశయాల మేరకే కొనసాగుతోందన్నారు. గాంధీజీ వారసులు మీరైతే కాశ్మీర్ సమస్య తో పాటు రామ మందిర్ ను ఎందుకు నిర్మిచలేదుని ప్రశ్నించారు.