పార్టీ ఆఫీసులో బండి సంజయ్ హౌజ్ అరెస్ట్

పార్టీ ఆఫీసులో బండి సంజయ్ హౌజ్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు పార్టీ  రాష్ట్ర కార్యాలయంలో హౌజ్ అరెస్ట్ చేశారు. గత రాత్రి  అబ్దుల్లాపూర్‌మెట్ లో సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా అక్కడే ఉంచారు. ఉదయం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఆయనను పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ ఆఫీసు నుంచి బయటకు రాకుండా పోలీసులు మోహరించారు.

ఇదిలా ఉంటే మునుగోడు ఎన్నికల పోలింగ్ సరళిని సంజయ్ అక్కడినుండే పరిశీలిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. టీఆర్ఎస్ దాడులకు, ప్రలోభాలకు బెదరకుండా పోలింగ్ సజావుగా సాగేలా, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రతి కార్యకర్త  అప్రమత్తంగా వ్యవహరించాలని సంజయ్ సూచించారు. మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ పార్టీ నేతలు బెదిరిస్తున్నారన్న సమాచారంతో అర్దరాత్రి సమయంలో మునుగోడుకు బయలుదేరిన సంజయ్ ను రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.