చిట్ చాట్ : బండి సంజయ్ కు ఫోన్ కష్టాలు

 చిట్ చాట్  : బండి సంజయ్ కు ఫోన్ కష్టాలు

దునియాల ఫోన్ లేనోల్లు ఎవరుంటరు. నాకు ఫోన్ లేదని ఎవరైనా అంటే పరేషాన్ కావాల్సిందే. ఒకవేళ ఎవరిదయినా ఫోన్ పోతే... కొన్ని గంటల్లోనో, ఒక్కరోజు అటూఇటుగా కొత్త ఫోన్ కొనుక్కోక తప్పదు. ఫోన్ తో అవసరం అట్లాంటిది. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈమధ్య ఎవరు ఫోన్ చేసినా కలుస్తలేదని చెబుతున్నారు. ఇంకొందరు అసలు ఆయన దగ్గర ఫోనే లేదని అనుకుంటున్నారట. దీంతో ఆయన్ను ఎట్లా కాంటాక్ట్ చేయలో తెలియక ఫీలవుతున్నారు.

ప్రోగ్రాముల్లో, టీవీల్లో కనిపించినప్పుడు గమనిస్తే నిజంగానే సంజయ్ జేబులో ఫోన్ కనిపించట్లేదని కార్యకర్తలు గుర్తించారు. గతంలో ఆయన ఎక్కడున్నా జేబులో ఫోన్ కనిపించేది. ఇప్పుడు అది లేదన్న ముచ్చట అర్థమైంది. ఫోన్ ఎందుకు లేదని పార్టీ వర్గాల్లో కొందరు ఆరా తీస్తే అసలు సంజయ్ ఫోనే మెయింటెయిన్ చేట్లేదని తెలిసి షాక్ తిన్నారట. 

టెన్త్ పేపర్ బయటికొచ్చిన టైంలో సంజయ్ పై అక్రమ కేసు పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం వివాదం రేపింది. అరెస్టు తర్వాత హైదరాబాద్ కు తరలించే తన ఫోన్ పోయిందని ఆ తర్వాత సంజయ్ చెప్పారు. అప్పటి నుంచే సంజయ్ దగ్గర ఫోనే లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన కాల్ కలవట్లేదని పీఏలు అంటున్నారట. 

ఫోన్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు కదా అని కొందరు కార్యకర్తలు అంటున్నారు. కొత్త ఫోన్ ఎందుకు తీసుకోవట్లేదనే చర్చ పార్టీ ఆఫీస్ లో జరుగుతోంది. దీనికి కారణం మాత్రం ఎవరికీ అంతుబట్టట్లేదు. ఏదోకారణంతోనే ఆయన ఫోన్ లేకుండా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. 

పెద్ద లీడర్లు పీఏల ద్వారా సంజయ్ ను కాంటాక్ట్ చేస్తున్నారు. అయితే లోకల్ లీడర్లు, ఆయనకు నేరుగా పరిచయం ఉన్న కేడర్లో మాత్రం కాంటాక్ట్ చేయలేకపోతున్నామనే ఫీలింగ్ ఉంది. ఏదేమైనా సంజయ్ కి ఫోన్ కష్టాలేంటో అని సరదాగా మాట్లాడుకుంటున్నారు. 

https://www.youtube.com/watch?v=8FhMp1cKSMc