
ఢిల్లీ : కేంద్రంలో మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సంజయ్ ఇవాళ భేటీ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు నడ్డాకు సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు. పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ తో కలిసి 15 నిమిషాలపాటు నడ్డాతో పలు విషయాలపై చర్చించారు. జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు.