పార్టీ నేతలతో సమావేశం కానున్న బండి సంజయ్

పార్టీ నేతలతో సమావేశం కానున్న బండి సంజయ్

మూడో విడత పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీస్లో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. యాత్రకు సంబంధించి ఏర్పాట్లు తదతర అంశాలపై వారు చర్చించనున్నారు. 

ఆగస్ట్ 2 నుంచి 26వ తేదీ వరకు బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర కొనసాగనుంది. యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి ఆలయం వరకు మొత్తం 328 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది. ఆగస్టు 2న యాదగిరి గుట్టలో యాత్ర ప్రారంభ సభ నిర్వహించనుండగా.. ఆగస్ట్ 26న పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు.