కేసీఆర్ పేరు ఇప్పటి నుంచి చాంద్ పాషా

కేసీఆర్ పేరు ఇప్పటి నుంచి చాంద్ పాషా

దేశం కోసం, ధర్మ కోసం పని చేయడమే సర్దార్ పటేల్‎కు నిజమైన నివాళి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సర్దార్ పటేల్ 146వ జయంతి సందర్భంగా నిజాంపేట్ క్రాస్ రోడ్స్‎లో ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. గతంలో పటేల్ జయంతిని గుర్తించని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆయన విగ్రహానికి పూలమాలలు వేస్తోందని సంజయ్ ఎద్దేవా చేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు పటేల్ విముక్తి కల్పించారని సంజయ్ గుర్తు చేసుకున్నారు. అలాంటి నేతకు కేసీఆర్ ఇప్పటివరకూ నివాళి అర్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ మ్యాచులో పాకిస్థాన్ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం దారుణమన్నారు. 

‘పాకిస్థాన్ జెండా తెలంగాణలో రేపరేపలాడితే ఉరికించి కొడుతాం. కరీంనగర్ లో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. పాకిస్థాన్ గానా ఇక్కడ నడవదు. యువకులు అందరిలో దేశభక్తి నిప్పడానికి రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినం నిర్వహించని ఏకైక ముఖ్యమంత్రి  కేసీఆర్. ఉద్యమంలో ఉన్నప్పుడు విమోచన దినం నిర్వహించాలని కొట్లాడి.. ఇప్పుడు మరిచిపోయాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఇప్పటి నుంచి  చాంద్ పాషా’ అని బండి సంజయ్ అన్నారు.