మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ ఫోకస్

మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ ఫోకస్

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నిర్వహిస్తున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మూడో విడుతకు రంగం సిద్ధమవుతోంది. జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో యాత్ర ఉండనుందని తెలుస్తోంది. వరంగల్ భద్రకాళీ ఆలయం నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ ఆలయం వరకు పాదయాత్ర కొనసాగనుంది. మొత్తం 20 రోజుల పాటు యాత్ర జరుగనుంది. 

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. 2వ విడుత ప్రజాసంగ్రామ యాత్ర సక్సెస్ ఫుల్ గా ముగియడంతో మూడో విడుతపై ఫోకస్ పెట్టారు కమలం శ్రేణులు. ఇటీవలే  జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ప్రజాక్షేత్రంలోకి ఎలాంటి కార్యక్రమాలతో వెళ్లాలన్న దానిపై చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పాదయాత్రపై సమాలోచనలు చేశారు. మూడు, నాలుగో విడుత పాదయాత్రలు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జరగనుంది. అయితే సంజయ్ పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందన్న దానిపై త్వరలో క్లారిటీ రానుంది.  ప్రజాసంగ్రామ యాత్ర మొదటి, రెండో విడత పాదయాత్రలు 67 రోజుల పాటు సాగింది. 13 జిల్లాల్లోని 9 పార్లమెంట్, 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగింది.