జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

జగిత్యాల జిల్లాలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జగిత్యాల జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ 12వ రోజు పాదయాత్రను కోరుట్ల మండలం వేంపేట నుంచి ప్రారంభించారు. ఈ క్రమంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని.. రైతు ఉద్యమ నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి సంజయ్ కి వినతి పత్రం సమర్పించారు. 

పసుపుకు క్వింటాల్ కు 15 వేల మద్దతు ధర కల్పించాలని, చెరుకు ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. వరి ధాన్యం తూకంలో జరుగుతున్న మోసాలపై, రైతుల అక్రమ అరెస్టులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతు నేతలు బండి సంజయ్ ని కోరారు.